రేపల్లెలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలం నెల్లూరి వారి పాలెం గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ‘జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు జరుగున్నవి. శనివారం మొదటి రోజు రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలం నెల్లూరి వారి పాలెం గ్రామంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బేగ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్, కొర్రపాటి నాగేశ్వరావు, చట్టాల త్రినాధ్, ముమ్మాలానేని సతీష్ రేపల్లె నియోజకవర్గ నాయకులు మత్తి భాస్కరరావు, చందోలు ప్రసాద్, మల్లి, శ్రీనివాసరావు పతేల్లా మల్లి, జనసైనికులు పాల్గొన్నారు.