జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన

ఆముదాలవలస, జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయడానికి శనివారం ఆముదాలవలస నియోజకవర్గంలో కొన్ని గ్రామంలో ముఖ్యంగా లాభం అనే గ్రామంలో జగనన్న కాలనీలో కావాల్సిన విద్యుత్ మరియు నీటి సరఫరా లేకుండా ఇళ్ళు కడుతున్నారు. విద్యుత్ మరియు నీరు అడిగితే మొదటి అందరూ ఇల్లులు పూర్తి అయ్యాక విద్యుత్ ఇస్తామన్నారు అందులో ఎవరు కట్టుకోకపోయిన ఈ రెండు అందించము అని చెప్పారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు మరియు సిక్కోలు విక్రం ఆధ్వర్యంలో శనివారం నాయకులు ఎంపీటీసీ విక్రమ్, సైరిగాపు సంతోష్, గేదెల ప్రసాద్, మణి, ప్రదీప్, మోహన్ తదితరులు పాల్గొని #JaganannaMosam అనే హాష్ టాగ్ ని చూపించి మరియు ప్రభుత్వం తక్షణమే దానిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.