జగనన్న ఇళ్లు- అవినీతికి ఆనవాళ్లు: గులకవరపు నరేష్

గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం, కంతేరు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సూచనలను అనుసరించి ‘జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగనన్న ఇళ్ల పేరుతో పేదలకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గులకవరపు నరేష్, అల్లం రమేష్, శ్రీనివాస్, బాలు, రమణ, భరత్, ప్రవీణ్ మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.