వినుత కోటా ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు!

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా జగన్ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జరుగుతున్న మోసాన్ని జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ఊరందూరు – ముచ్చువొలు మధ్య మార్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శంకుస్థాపన చేసిన జగనన్న కలనీను పరిశీలించడం జరిగింది. అనంతరం శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలోని జగనన్న నవరత్నాల గుడి ఉన్న ప్రాంతంలోని వైఎస్సార్ జగనన్న కాలనీను పరిశీలించడం జరిగింది. అనంతరం రాజీవ్ నగర్ కాలనీలోని టిడ్కో గృహాలను పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఊరందురు ప్రదేశంలో కనీసం 25,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఒక్కటంటే ఒక్క ఇళ్లు కూడా నిర్మాణం పూర్తి కాలేదు, ఇళ్ళ నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించారు. చాలా వరకు ప్రారంభించిన ఇళ్లు పునాదుల వరకే ఒక్క అడుగు మాత్రమే పొడవుతో ఉన్నాయి, కొన్ని మొండి గొడలే ఉన్నాయి. కనీసం ఇళ్ళ నిర్మాణానికి అవసరం అయిన రోడ్లు, నీళ్ళు, కరెంట్ సదుపాయం కల్పించలేదు. రాజీవ్ నగర కాలనీలోని నవరత్నాల గుడి ప్రాంతంలోనూ 1900 ఇళ్లకు పేదలకి ఇచ్చిన ఒక్క ఇళ్లు కూడా పూర్తి కాలేదు, టిడ్కో ఇళ్లు దాదాపు శ్రీకాళహస్తిలో 6000 ఇళ్లు 80-90% పనులు పూర్తి అయినా కానీ లబ్ధి దారులకు మంజూరు చేయలేదు. ఇళ్ళ నిర్మాణం కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల నాసిరకం పనులు చేస్తున్నారు సిమెంట్ ఇటుకల తయారీ ఇసుక బదులు లాంకో కంపెనీ నుండి తెచ్చే వేస్టేజ్ మట్టిని వాడుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొదట విడతగా దాదాపు 12,000 ఇళ్లు నిర్మాణానికి ఇచ్చి కేవలం 100 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఇళ్లకు గాను కేవలం 1.5 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి కావడం పేద ప్రజలను తీవ్రంగా మోసం చెయ్యడమే. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, 4 మండలాల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.