చీపురుపల్లి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పై అనుచితి వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి నిప్పుల చెరిగిన చీపురుపల్లి జనసేన నేత విసినిగిరి శ్రీనివాసరావు. గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు అందరూ రాజకీయానికి తక్కువ, రౌడీయిజానికి ఎక్కువగా చేసినప్పుడు మీకు గుర్తు లేదా రెడ్డి అని ప్రశ్నించారు. గత పాలనలో మీరు చేసిన అక్రమాలకు అన్యాయాలకు దౌర్జన్యాలకు భూకబ్జాలకు ప్రజలందరినీ భయభ్రాంతులను చేసిన సంగతి మీకు తెలియదా.. అందుకనే మిమ్మల్ని “10 కి ఎక్కువ, 12 తక్కువ” చేసిన సంగతి మీకు గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మీ నాయకులు అవాక్కులు చవాక్కులు మానేసి ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలని హితవు పలికారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలకోట్లను దోచుకుని తండ్రి కరిష్మాతో పార్టీని పెట్టి రాజకీయం చేసిన నువ్వు, తన సొంత చరిష్మాతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రజలు అభిమానాన్ని పొంది 100% స్ట్రైక్ రేట్ తో గెలుపొందిన పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి నీకు లేదని హెచ్చరించారు. వైసిపి పార్టీని నమ్ముకుని అవాకులు పేలిన మీ నాయకులు పరిస్థితి జైలు గోడలకు పరిమితమవుతుంది. అతి త్వరలో మీ అవినీతి సామ్రాజ్యంలో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ జైలు పక్షులు కాక తప్పదని, నీ నేర సామ్రాజ్యంలో నేరస్తులందరికీ ఈ ప్రజా ప్రభుత్వంలో శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వ విధానాలపై పాలసీలపై తమ అభిప్రాయాలను వెలవిచ్చాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని సున్నాకి ఎక్కువ ఒకటి తక్కువ చేసే పరిస్థితి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్ల మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్, ఎచ్చెర్ల లక్ష్మి నాయుడు, కింతలి వాసుదేవరావు, పొట్నూరు త్రినాధరావు, సబ్బి సింహాచలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment