జగన్మోహన్ రెడ్డి స్ధాయి జైలుకి ఎక్కువ బెయిల్ కి తక్కువ: ఉప్పు వెంకట రత్తయ్య

గుంటూరు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చౌకబారు విమర్శలు గుప్పిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభంజనంతో ఐదు కోట్ల మంది ప్రజాభిమానం చూరుగొని సంవత్సర కాలంగా సుపరిపాలన అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పై నేడు జైలుకి ఎక్కువ… బెయిల్ కి తక్కువ అయిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన చౌకబారు వ్యాఖ్యలు అర్థరహితమని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య కొట్టిపారేశారు. గత ఐదు సంవత్సరాలలో పరిపాలన గాలికొదిలేసి మద్యం కుంభకోణాలు, ఇసుక కమీషన్లుతో రాష్ట్రాన్ని అవినీతి సర్వం దోచుకున్న జగనాసురుడు నేడు ఊకదంపుడు అబద్ధాలు చేప్తే వినే పరిస్థితులు లేవని విమర్శించారు. అధికారం పోయి,ప్రతిపక్ష హోదా కూడా లేక మరియు అసలు ఏమి చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఇక జగన్ రెడ్డికి ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెర్తు ఖాయం అని రాష్ట్ర ప్రజలంతా చర్చిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం పోటీ తన తరపున అభ్యర్ధులను నిలపలేని దద్దమ్మ జగన్ అని ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీకి రానప్పుడు జగన్మోహిన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు.

Share this content:

Post Comment