పెనుకొండ జనసేన ఆధ్వరంలో జగనన్న మోసం

పెనుకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రా వ్యాప్తంగా తలపెట్టిన జగనన్న ఇళ్లు – పేదలకంట్లో కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు పెనుకొండ పట్నంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి విద్యుత్ నీరు రోడ్లు డ్రైనేజీలు సరిగా లేవని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్ మరియు మండల అధ్యక్షులు మహేష్ పెనుకొండ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పెనుకొండ సీనియర్ నాయకులు బంగారం, హరి నాయక్, పెనుకొండ పట్టణ యువత నాయకులు మల్లేష్ నాయకులు గంగాధర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.