ఘనంగా ప్రారంభమైన జగన్నాథ స్వామి రథయాత్ర

*ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డాక్టర్ కందుల నాగరాజు
*ఉత్కల్ సేవా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా కార్యక్రమం
*భారీగా తరలివచ్చిన భక్తులు

విశాఖ, జగన్నాథ స్వామి రథయాత్రను ఉత్కల్ సేవా సంఘం ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గోకుల్ థియేటర్ సమీపంలోని ఏడు గుళ్ళు జంక్షన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ స్వామి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారు చీపురుతో వాకిలిని శుభ్రం చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని డాక్టర్ కందుల నాగరాజు కోరారు. ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ఆరంభం కావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్ర దేవి, మూడు భవ్యమైన రథాలపై తరలుతారని, ఆషాఢ మాసంలో శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు ఈ ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారని వెల్లడించారు. ఇది భక్తి, ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. జగన్నాథ స్వామి వారి దివ్య దర్శనం వచ్చిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహకులు కూడా ఈ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారని కొనియాడారు.

Share this content:

Post Comment