జగనన్న తోడు.. చిరువ్యాపారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సిఎం జగన్‌

కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకోవడానికి సీఎం. జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులను అదుకోబోతున్నారు. చిరువ్యాపారులకు రూ.10వేల రూపాయల వడ్డీలేని రుణాలను మంజూరు చేయబోతున్నారు. తాడెపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 11 గంటలకు వర్చువల్ విధానంలో నగదును బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరబోతున్నది. ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించబోతున్నది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఈ పథకాన్ని అమలు చేశారు. కాగా, రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.