రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ఇష్టానికి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ కి ఆత్మకూరు నియోజవర్గ జనసేన నేతల మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జి నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు బస్టాండ్ సెంటర్ లో వై.ఎస్ జగన్ దిష్టి బొమ్మ దహనం చేసారు. ప్రతిపక్ష పార్టీ హోదా కోసం అడుక్కోవడం మానేసి ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలి. అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు కూడా ఉండని జగన్ కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కనీసం 10% సీట్లు లేని పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని జగన విఫల యత్నం. ఓటమిని జీర్ణించుకోలేక జగన్ కి మతి భ్రమించింది. ఏ పదవి లేక పోయినా 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ప్రతి పక్షంలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా జగన్ అసెంబ్లీకి రావట్లేదు. అసూయతో సైకోలా మారిన జగన్ కి వైద్యం అవసరం. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మరియు మండల ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment