జగన్‌ రాజకీయ తీరు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరం

*జనసేన ఇంచార్జి సాకే మురళీకృష్ణ తీవ్ర విమర్శ

బుక్కరాయసముద్రం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి “రపా రపా నరికేస్తా” అనే భాషను ఉపయోగించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, ఇది అసహనాన్ని రెచ్చగొట్టే రాజకీయ ఉన్మాదమేనని జనసేన నేతలు తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్ సూచనలతో నియోజకవర్గ ఇంచార్జి సాకే మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి. ప్రజలకు భరోసాగా నిలబడాలి. జగన్ మాత్రం ప్రజల ప్రాణాల కంటే రాజకీయ లబ్ధిని ఎక్కువగా చూస్తున్నాడు” అని విమర్శించారు. పొదిలిలో వైసీపీ కార్యకర్తల అరాచకానికి స్పందనగా పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, జగన్ వాటిని తక్కువ చేసి, బల ప్రదర్శనకు పాల్పడతూ ఇద్దరు కార్యకర్తల ప్రాణాలను పొగొట్టుకున్నారని, అయినా ఆయన కనీసం స్పందించకపోవడం హృదయద్రావకమన్నారు. “బెట్టింగ్ మాఫియాలకు పరామర్శకు వెళ్లే జగన్, తన పర్యటన కారణంగా చనిపోయిన తన పార్టీ కార్యకర్తలకైనా ఒక్క మాట సానుభూతి చెప్పలేదంటే, అది మానవత్వమేనంటారా?” అని ప్రశ్నించారు మురళీకృష్ణ. జగన్ విధ్వంసమే అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షుడు ఎర్రి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి అరటి తాహిర్, నాయకులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment