హైంద‌వ ధ‌ర్మం గురించి జ‌గ‌న్ మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంది: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, హైంద‌వ ధ‌ర్మం గురించి వైసీపీ అధినేత జ‌గ‌న్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంద‌ని జ‌న‌సేన సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. శనివారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేష్ గ‌తంలోనే స్పందించారని, అన్నదాన సత్రాన్ని కూల్చడం బాధాకరమని, కట్టడాలను కూల్చిన స్థానంలో తన సొంత ఖర్చులతో తిరిగి నిర్మాణాలను నిర్మిస్తామని తెలిపార‌ని, అత్యుత్సాహం ప్రదర్శించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్ల‌డించార‌ని గుర్తు చేశారు. ఇది జ‌రిగిన రెండు వారాల‌కు నిద్ర‌లేచిన జ‌గ‌న్ త‌న గ‌త‌పాల‌నలో జ‌రిగిన త‌ప్పులు మ‌రిచి సీఎం చంద్ర‌బాబు,డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం, తానే హైంద‌వ ధ‌ర్మాన్ని కాపాడాన‌ని చెబుతూ త‌న ఉనికిని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌నంలో పార్టీ ప్ర‌తిష్ట దిగ‌జారి, రోజుకు ఒక‌రు చొప్పున పార్టీని వీడుతుంటే హిందుధ‌ర్మం అంటూ కొత్త డ్రామాకు తెర‌తీస్తున్నార‌ని వెల్ల‌డించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, పలు ఆలయాలు ధ్వంసమయ్యాయని, దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మార్చి వేశార‌ని, వైసీపీ అధినేత‌ జగన్‌ హిందూ ధర్మ ద్రోహిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయార‌ని బాలాజి గుర్తు చేశారు. వైసీపీ పాల‌న కాలంలోనే అంతర్వేది రథం దగ్ధం, రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం తలనరికి పడేసిన ఘటన, పిఠాపురంలోని 17 దేవాలయాల్లో ఒకే రోజులు దాడులు జరిగాయని. 150 దేవాలయాల వరకు కూల్చబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రాలను వ్యాపార క్షేత్రాలుగా మార్చి భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తిరుమ‌ల తిరుప‌తి ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తిశార‌ని, తిరుమ‌ల కొండ‌పై అన్య‌మ‌త ప్ర‌చారం కొన‌సాగింద‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుమ‌ల‌లో పార్టీ జెండాల‌తో వెళ్లి, రాజ‌కీయాలు మాట్లాడి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చార‌ని ఆరోపించారు. హిందూ సమాజం జగన్‌ను క్షమించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకొనేందుకు జ‌గ‌న్ చేస్తున్న ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు.

Share this content:

Post Comment