మహాసముద్రం నుండి జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్, సిద్ధార్ద్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో జగపతి బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఆయన బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

జగపతి బాబు స్పెషల్ పోస్టర్ ద్వారా మహా సముద్రంలో ఆయన చుంచు మామ అనే పాత్రలో కనిపించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే పోస్టర్ లో జగపతి బాబు లుక్ గ్రిప్పింగ్‌గా ఉంది. రఫ్ లుక్‌తో ఆయన కనిపిస్తుండగా, ఇందులో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది. ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత అజయ్ భూపతి చేస్తున్న మూవీ మహా సముద్రం కావడం, చాలా కాలం తర్వాత సిద్దార్ద్ మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండడంతో అంచానాలు భారీగా ఉన్నాయి.