జగ్జీవన్ రామ్ ఆశయ సాధనే జనసేన లక్ష్యం: నేరేళ్ళ సురేష్

గుంటూరు అర్బన్, మాజీ ఉప ప్రధాని, సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయంలో అయన చిత్ర పటానికి గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ… డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 5 ఏప్రిల్ 1908న బీహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక కార్యకర్త అయిన జగజ్జివన్ రామ్ నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగానూ మొరార్జీ దేశాయ్ కాలంలో భారత ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారన్నారు. అణగారిన వర్గాల వారి సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దళిత నాయకులు జగ్జీవన్‌ రామ్‌ అని కొనియాడారు. అద్భుతమైన పోరాట శక్తి గల జగ్జీవన్‌ రామ్ తన జీవిత పర్యంతం పేదల అభివృద్ధి కోసం పరితపించేవారన్నారు. ఆయన ఆశయాలను జనసేన ఆలంబనగా తీసుకొని ముందుకు సాగుతుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు చింతా రేణుక రాజు, నగర కార్యదర్శులు కొత్తకోట ప్రసాద్, కలగంటి త్రిపుర కుమార్, పావులూరి కోటేశ్వరరావు, అందే వెంకటేశ్వరరావు, నగర సంయుక్త కార్యదర్శులు గుండాల శ్రీనివాసరావు, కొండేటి కిషోర్, పులిగడ్డ గోపి, బొందిలి నాగేంద్ర సింగ్, డివిజన్ అధ్యక్షులు, మాదాసు సోమశేఖర్, పులిగడ్డ నాగేశ్వరరావు, కొనిదే దుర్గాప్రసాద్, గట్టు శ్రీకాంత్, జడ సురేష్, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.