వీరమహిళలకు జక్కంపూడి క్షమాపణ చెప్పాలి: దినకర్ బాబు

కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా శాంతియుతంగా వినతి పత్రాన్ని ఇచ్చే సందర్భాన్ని రసాభాస చేసిన ప్రభుత్వం మరియు పోలీసులు

జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను వీర మహిళలను నిర్బంధించటం, అడ్డుకోవడం విచారకరమైన సంఘటనగా రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని సజావుగా పంపిణీ చేయకుండా నామమాత్రపు నష్టపరిహారాన్ని అందించడం విచారకరమని.. ఈ విషయంపైన ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుగా వర్ణించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వరద బాధితులను సరైన రీతిలో ఆదుకోవాలని ప్రజల ఆందోళన కార్యక్రమాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలన్నారు. ఆందోళనలలో వీరమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రజా శాంతియుత నిరసనలను అడ్డుకుంటే ప్రజల నిరసనగలం తీవ్రతరం అవుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.