నవకండ్రవాడలో దళితవాడలో జనచైతన్యం

పిఠాపురం, చైతన్యవంతమైన దళిత యువకులను జనసేన పార్టీ వైపుగా నడపడమే లక్ష్యంగా, జనసేన పార్టీని ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయాలనే కుట్రతో చేస్తున్న విషపూరిత ప్రచారం తిప్పి కొట్టడమే ధ్యేయంగా పిఠాపురం రూరల్ జనసేన నాయకుడు మరియు దళిత నాయకులు అయిన వాకపల్లి సూర్య ప్రకాశ్ పిఠాపురం రూరల్ మండల వ్యాప్తంగా మొదలు పెట్టిన దళిత వాడల్లో జనచైతన్యం కార్యక్రమం విశేషమైన ప్రజా స్పందనతో దిగ్విజయంగా కొనసాగుతూ నేడు నవకండ్రవాడ చేరుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం నవకండ్రవాడ జనసేననాయుకులైన తోట శ్రీను, సిహెచ్.విష్ణు, ఎం.రాజు, కర్రి శ్రీను, పింకీ సురేష్, కర్రి స్వామి, గాది మణికంఠ, మేడిశెట్టి కామేష్, గాది శ్రీను, కోన రాముల ఆధ్వర్యంలో కొనసాగి స్థానిక భీమ్ యువత సహకారంతో విజయవంతం అయినది. కార్యక్రమానికి ముందుగా మహనీయులు అంబేద్కర్ ప్రతిమను పూలతో అలంకరించి ఘననివాళి తెలిపిన అనంతరం స్థానిక యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించిన తదుపరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయిన దళిత యువతతో సమావేశమయ్యి వారి సహకారంతో ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలిపే కరపత్రాలను పంచిపెట్టారు. వడ్డే రాజశేఖర్, పి. రామకృష్ణ, బి. ప్రసాద్, ప్రేమ్, జి వెంకట్, ఆర్ సోను, ఎం వివేక్, కె దాసు, పి రోహన్, పి విజయ్ మొదలగు మెగా అభిమానులైన దళిత సోదరులతో ఏర్పాటైన ఈ సమావేశంలో రూరల్ మండల నాయకులైన రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్, గంజి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.