కావలి, తాతా బాబురావు అనే జనసైనికుడు రాజమండ్రి నుండి తిరుపతికి సైకిల్ యాత్ర మార్చి 11 న తారీకు ప్రారంభించడం జరిగింది. మార్గమధ్యలోని కావలి నియోజకవర్గం ఇంచార్జి అళహరి సుధాకర్ ఆదేశాల మేరకు శుక్రవారం వారిని సాదరముగా స్వాగతం పలికి అతిథి సత్కారము చేసి జనసేన పార్టీ కావలి కార్యాలయంలో బస ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంచార్జికి నాయకులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఐటి కో-ఆర్డినేటర్ బాలు పసుపులేటి, అగస్టీన్, సుంకర వినయ్, నాగేంద్ర కళ్యాణ్, మండ శ్రీను మరియు వీర మహిళలు కందుల లక్ష్మీ కవిత, సాహితీ, హెలెన్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment