ఉప్పాడ గ్రామంలో వర్షం కారణంగా కూలిపోయిన పేరూరి రమణ పెంకుటిల్లు విషయమై స్పందించిన జనసేన నేత గంటా విజయ్ కుమార్, ఘటన స్థలానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించి ఆహార ధాన్యం (రైస్ బ్యాగ్) అందజేశారు. నూకాలమ్మ గుడి పక్కన జరిగిన ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రతి సమస్యకూ తోచిన సాయం చేయడం జనసేన ధ్యేయం,” అని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం బాధితులకు తగిన సాయం అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సహాయక కార్యక్రమంలో సూరాడ నాగేశ్వరరావు, సూరాడ కృష్ణ, గంటా సింహాద్రి తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment