ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు గురువారం నిడదవోలు మంత్రి వారి కార్యాలయం నందు జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త యర్నాగుల శ్రీనివాసరావు అధ్యక్షతన మార్చి 14న పిఠాపురం దగ్గర చిత్రాడ గ్రామంలో జరగబోవు బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్ల గూర్చి మరియు కార్యచరణ ప్రణాళిక గూర్చి నిడదవోలు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మరియు జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ ఆవిర్భావ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా కార్యదర్సులు, జిల్లా సంయుక్త కార్యదర్శిలు, మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment