జనసేన ఆవిర్భావ సభ సమన్వయ సన్నాహక సమావేశం

విజయవాడ బందర్ రోడ్డు విజయకృష్ణ సూపర్ బజార్ పక్కన అమరావతి కన్వెన్షన్ లో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో “జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం” సందర్భంగా సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పి.ఎ.సి చైర్మన్ మరియు ఆంధ్ర ప్రదేశ్ పౌరసరాఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొని ఆవిర్భావ దినోత్సవానికి ఏ విధంగా సన్నాహాక కార్యక్రమాల్లో పాల్గొనాలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎపిఐఐసి డైరెక్టర్ & జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల్లా రామ్మోహన్ గాంధీ, సెంట్రల్ నియోజకవర్గం పిఓసి బొలిశెట్టి వంశీ, నందిగామ నియోజకవర్గం పిఓసి శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, తిరువూరు నియోజకవర్గ పిఓసి మనుబోలు శ్రీను, జగ్గయ్యపేట పిఓసి బాడిశ మురళీకృష్ణలతో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ, కృష్ణ పెన్నా రీజినల్ కమిటీ సభ్యులు, విజయవాడ నగర కమిటీ సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కమిటీ సభ్యులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-08-at-8.56.32-PM-576x1024 జనసేన ఆవిర్భావ సభ సమన్వయ సన్నాహక సమావేశం

Share this content:

Post Comment