నీలకంఠాపురం గ్రామ సమస్యలపై ప్రభుత్వ అధికారులకు జనసేన వినతి

పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం నీలకంఠాపురం గ్రామంలో పలు సమస్యలను ప్రభుత్వఅధికారుల దృష్టికి గ్రామ జనసైనికుల చొరవతో మండల నాయకులు అల్లు రమేష్ అద్యక్షతన విన్నవించటం జరిగింది. జనసేన మండల నాయకులు అల్లు రమేష్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం, కానీ నేటి ప్రభుత్వంలో మౌళిక సదుపాయాలు కూడా కొన్ని గ్రామాల్లో లభించటం లేదు. ఇదేనా గాంధీ కలలు కన్న స్వరాజ్యం అని ప్రతిఘటిస్తూ, ప్రజావసరాల్ని తీర్చాల్సిన ప్రజాప్రతినిధులే ఎన్ని సార్లు సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చూపలేదు. ప్రభుత్వ అధికారులుగా ఉన్న మీరైనా గ్రామ సమస్యల్ని పరిష్కరించాలని కోరటం జరిగింది అని తెలుపుతూ వినతిపత్రమివ్వడం జరిగింది. అధికారులు వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అల్లు రమేష్, వెంకటరమణ, పద్మారావు, కృష్ణమూర్తి, శ్రీను, సాయి మరియు పార్వతీపురం నాయకులు పైల శ్రీను, లక్ష్మి మరియు గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.