చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన ఖండిస్తుంది: కిరణ్ రాయల్

  • రాష్ట్రంలో ప్రతిపక్షాల నోరు నొక్కి జగన్ రాజకీయం చేస్తున్నాడు
  • వైసీపీ కి కౌన్ డౌన్ మొదలైంది, ప్రతి విషయం నోట్ చేసుకుంటున్నాం
  • రాబోయేది మా ప్రభుత్వమే కిరణ్ రాయల్

తిరుపతి: పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల నోరు నొక్కి జగన్ రాజకీయం చేస్తున్నారని, వైసీపీ కి కౌన్ డౌన్ మొదలైంది, ప్రతి విషయం నోట్ చేసుకుంటున్నామని, వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రజల సొమ్ముతో లండన్ లో జగన్ విహారయాత్రలు చేస్తున్నాడని, జగన్ అండ్ టీం త్వరలోనే జైలుకు పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని, రాబోయేది మా ప్రభుత్వమేనని, సెప్టెంబర్11వ తేదీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలను జగన్ డైవర్షన్ చేస్తున్నాడని, ఏపీలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఇదే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, చేతగాని చెత్త ముఖ్యమంత్రి జగన్ అని శనివారం కిరణ్ రాయల్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాజమోహన్, రాజేష్ ఆచారి, నాగరాజు, రమేష్, హిమవంత్, ఆది తదితరులతో కలిసి చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన తరఫున తీవ్రంగా ఖండించారు.