మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే జనసేన ధర్నా: దాసరి రాజు

ఇచ్ఛాపురం నియోజకవర్గం, కవిటి మండలం, ఉద్ధాన ప్రాంతంలో గత నాలుగు రోజులుగా ఉద్దాన మంచినీటి పథకం కుళాయి ద్వారా చేసే నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకున్న ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు దీనికి గల కారణాన్ని ఆరా తీయగా ఉద్దానం పథకం తాగునీటి సిబ్బందికి గత 27 నెలలుగా వారి వేతనాలు చెల్లించకపోవడం వలన సమ్మె చేపట్టారని తెలుసుకొని ఈరోజు కవిటిలో ఉద్దాన పథకం తాగునీటి సిబ్బంది చేస్తున్న సమ్మె వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సమ్మెకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ, ఏదైతే జడ్పీ నిధులు ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో నిరుపేద ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వెంటనే ఈ మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే జనసేన పార్టీ తరపున ప్రజల మద్దతుతో జనసేన ధర్నాకు దిగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వ వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ఎంపీటీసీ అభ్యర్థి గుల్ల కుర్మారావు, బడగల రామకృష్ణ, బడే రాజు, శ్యామ్, ధనంజయం తదితరులు పాల్గొన్నారు.