అక్రమ అరెస్టులకు నిరసనగా ప్రత్తిపాడు జనసేన ధర్నా

ప్రత్తిపాడు, శనివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించబోయే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నోవాటెల్ హోటల్ దగ్గర పోలీసుల్ని మోహరించి, జనసేన నాయకుల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఈ అప్రజాస్వామిక అరెస్టులకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు పిలుపు మేరకు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ చట్టాల్ని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, కానీ ఈ అధికార వైసీపీ ప్రభుత్వం చట్టవిరుద్దంగా అప్రజాస్వామికంగా మా నాయకుల్ని అరెస్ట్ చేసిందని, మా సహనాన్ని పరీక్షించొద్దని బేషరతుగా మా నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, సమన్వయ కర్త పెంటకోట చంటిబాబు, ఏలేశ్వరం మండల ఉపాధ్యక్షులు పలివేల వెంకటేష్, నియోజకవర్గ యువ నాయకులు వరుపుల సాయికిరణ్, జనసేన నాయకులు కాసు బ్రహ్మానందం, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంగిరెడ్ల మణికంఠ నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.