జనంకోసం జనసేన.. భయ్యారెడ్డి కాలనీలో గంగారపు పర్యటన

  • రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరికు సమస్యలు విన్నవించిన కాలనీవాసులు.
  • పవన్ కళ్యాణ్ సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ

మదనపల్లె, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మదనపల్లె మండల కోళ్లబయలు పంచాయతీ భయ్యారెడ్డి కాలనీలో జనసేన నాయకులు రాయలసీమ కో కన్వినర్ గంగారపు రామదాస్ చౌదరి పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మచెరువు మిట్టలోని గంగమ్మ ఆలయంలో రామదాసు చౌదరి ఆధ్వర్యంలో అడపా సురేంద్ర ఆధుక్షతన పూజలు నిర్వహించారు. అనంతరం భయ్యారెడ్డి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరితో స్థానిక ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అధికార వైసిపి పార్టీకి చెందిన అభ్యర్థి ఓడిపోవడంతో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదన్నారు. అధ్వానమైన రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధి లైట్ల సమస్య, విష సర్పాలు బెడద ఈ సమస్యలతో సతమతం అవుతున్నట్లు మొరపెట్టుకున్నారు. ప్రతి ఇంటిలోనూ రామదాస్ చౌదరికి ఘన స్వాగతం పలికి ఆశీర్వదించారు. స్థానికుల నుండి ఘన సన్మానం అందుకున్నారు. రామదాస్ చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా రామదాస్ చౌదరి ప్రజలకు వివరించారు. వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.