వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనంకోసం జనసేన

తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో సోమవారం జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం సాటివారి గూడెం, చాతకొండ ఎస్సి కాలనీలో ప్రజలను కలిసి వారి సమస్యలను కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాధిక్ పాషా, సోషల్ మీడియా సెక్రటరీ వెంకట్ ఫణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి అనిత్ తదితరులు పాల్గొన్నారు.