విడివాడ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనంకోసం జనసేన

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 21, 22వ వార్డుల్లో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనంకోసం జనసేన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ రైతులు వర్షాలు వచ్చి ధాన్యం తడిసిపోయిందని సంచులు లేవని ఇలా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని రైతుల బాధపడుతుంటే మన మినిస్టర్ పౌరసరఫరా మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు బైక్ ర్యాలీలు పెడుతూ అమరావతిలో ఇచ్చిన సెంటు భూములు దేనికి పనిచేయవని చంద్రబాబు అన్న మాటలకు దానికి నిరసనగా సోమవారం తణుకు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ పెట్టి నిరసన తెలియజేశారు అసలే ప్రభుత్వం పెట్రోలు డీజిల్ రేట్లు పెంచారని జనాలు ఇబ్బంది పడుతుంటే ఇలా మినిస్టర్ గారేమో ర్యాలీలు పెడతాం చాలా దుర్మార్గం అని జనసేన పార్టీ దీని తీవ్రంగా ఖండిస్తుందని జనసేన పార్టీ అధికారంలోకి రాగానే స్వచ్ఛమైన పరిపాలన ప్రజలకు అందిస్తామని తణుకు నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు తెలియజేచేశారు. అలాగే కారుమూరి వెంకట్ నాగేశ్వరావుకి తణుకు నియోజకవర్గ ప్రజలు రానున్న ఎన్నికల్లో చక్కటి గుణపాఠం తెలియజేస్తారని రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గరే తులసీరామ్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, తణుకు లీగల్ సెల్ కన్వీనర్ కొయ్యల విజయ్ కుమార్, జిల్లా జాయింట్ సెక్రెటరీ తామవరపు చిన్న, మండపాక వైస్ ప్రెసిడెంట్ వట్టికూటి నగేష్, 21వ వార్డు కార్యకర్తలు శివాజీ, పవన్, అరుణ్, బాలు జవాది ప్రసాద్, కురసల శ్రీనివాస్, కేశవ, శివటం సునీత, కమవరుపు రూప, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.