తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, ఐ పంగిడి గ్రామంలో శుక్రవారం జనసేన ఆవిర్భావ విజయోత్సవ జయకేతనం కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ మధ్యభాగంలో ఉన్న సంత మార్కెట్ వద్ద అందరికీ అందుబాటులో ఉండేలా నూతనంగా జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని గ్రామాధ్యక్షులు వాసిరెడ్డి వెంకటేష్ కన్నప్ప, సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్, పెరుగు శివ, మడిచర్ల నాగరాజు, పూటి జగదీష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు, గ్రామస్థులు పాల్గొని విజయోత్సాహాన్ని పంచుకున్నారు. జనసేన జెండాను ఎగురవేసి, స్వీట్స్, డ్రింక్స్ పంపిణీ చేశారు. పీఠాపురంలో జరుగుతున్న జయకేతనం సభను విజయవంతం చేయడానికి ఐ పంగిడి నుండి 5 కార్లతో జనసేన నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొప్పాక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్‌చార్జి టివి రామారావు గారితో కలిసి అందరూ చలో పిఠాపురం సభలో పాల్గొనడానికి సన్నద్ధమయ్యారు.
Share this content:
Post Comment