రాజంపేటలో ఘనంగా జనసేన జయకేతనం సంబరాలు

జనసేన జయకేతనం సందర్భంగా, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా టీ.సుండుపల్లి మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి సర్కిల్ వద్ద ప్రజల సమక్షంలో జనసేన జెండా ఆవిష్కరణ చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఠాపురం చిత్రాడలో నిర్వహిస్తున్న జయకేతనం బహిరంగ సభకు అన్నమయ్య జిల్లా నుండి వేలాది మంది జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువవుతామని, ఆయన సైద్ధాంతిక బావజాలంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ముందుకు సాగుతూ గత సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థులు అసెంబ్లీ, లోకసభ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా జనసేన ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య, నీటి సంగం అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, జనసేన నాయకులు జగిలి ఓబులేసు, షేక్ సలీమ్, విజయభాస్కర్, మంగిరి రమణయ్య, గాలి వెంకటరమణ, శ్రీనివాసులు, కృష్ణయ్య, వెంకటయ్య, చెన్నంశెట్టి వెంకటరమణ, కేశవ, పెదబ్బా, హరికృష్ణ, బుజ్జి, లోకేష్, కళ్యాణ్, మహ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గ్రామాల ప్రజలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

WhatsApp-Image-2025-03-14-at-3.58.39-PM-1024x771 రాజంపేటలో ఘనంగా జనసేన జయకేతనం సంబరాలు

Share this content:

Post Comment