జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి కొత్త కొటి ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శీనువాసు రావు తోట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గుడి వద్ద కేక్ కట్ చేసి, ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా కొత్త కొటి ప్రసాద్ మాట్లాడుతూ, జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటారని, గత వైసీపీ ప్రభుత్వ అన్యాయాలను ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్రను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి అళ్ల హరి, బీజేపీ నాయకులు అప్పటిశెట్టి రంగా, జూపూడి భవాని, తెలుగు దేశం పార్టీ నాయకులు నాగూర్ వలీ సుభాని, మాజీ కార్పొరేటర్ వంజరపు రత్నకుమారి, జనసేన డివిజన్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వరరావు, చందు శీనువాసు రావు, శ్రీకాంత్, చింతకాయల శివ, నగర నాయకులు సోము ఉదయ్ కుమార్, అళ్ల హరి యుగంధర్, రామిశెట్టి శీను, పగడాల రామకృష్ణ, రాజేష్ రాజు, వంజరపు దేవి ప్రసాద్, రేజేటి శేఖర్, రేజేటి శీనువాసు రావు, బాజీ కుమార్, స్వామి, కొత్త కోటి ఉమా లక్ష్మి, రేజేటి రాజీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment