పెదనందిపాడు మండలంలోని వరగాని గ్రామంలో జనసేన నాయకుడు దిరిశాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య పాల్గొన్నారు. పెదనందిపాడు మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొన్నారని వారు పిలుపు నిచ్చారు. కార్యకర్తలు ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా మన నాయకులు ఏర్పాట్లు చేయనున్నారని వారు తెలియజేశారు. గతంలోనే మన అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ ఈసారి విజయం సాధించి ఆవిర్భావ దినోత్సవ సభను జరుపుకోవాలని అన్నారని, అదే విధంగా కార్యకర్తలు వారి ఆజ్ఞను శిరసావహించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి మన జనసేన పార్టీకి 100% విజయం సాధించడం ద్వారా ఈ సభ చాలా ప్రత్యేకతను చాటుకోటుందని నేతలు తెలిపారు. గత 11 ఆవిర్భావ సభలు పోరాటం చేసి జరుపుకున్నాము. కాని నేడు అధికారం భాగస్వామిగా వుంటూ పిఠాపురం లో జరిగే ఈ సభ కార్యకర్తలకు, నాయకులకు ఉత్సాహాన్ని నింపేదిగా వుంటుందని అన్నారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి ఆధునిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సానుభూతి పౌరులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోర్రపాటి నాగేశ్వరరావు, ఉప్పు వెంకటరత్తయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగినేని సునీల్ కుమార్, వరగాని గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment