- ఆవిర్భావ దినోత్సవ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్తగా మూడు రోజులపాటు 24 గ్రామాలలో పి.వి.ఎస్.ఎన్. రాజు పర్యటన
జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో, పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన చోడవరం జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పీవీఎస్‌ఎన్ రాజు తన మూడోరోజు పర్యటనలో భాగంగా చిత్రాడ, నవ కండ్రవాడ, మాధవపురం, బిప్రత్రిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం గ్రామాలను మండల నాయకులతో కలిసి సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన గ్రామ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, వీర మహిళలను కలుసుకుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుందో వివరించారు. జనసేన పార్టీ నిర్వహించే ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల తమ మద్దతును ప్రకటిస్తూ, ఆయనతో కలిసి పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో జనసేన పార్టీని బలోపేతం చేసి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయా గ్రామాల నాయకులతో కలిసి ప్రజలకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ కరపత్రికలు పంపిణీ చేశారు. ఈ పర్యటనలో వూట నానిబాబు, ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, వెన్నా జగదీష్, చక్రధరరావు, పిల్లా దినేష్, తుమ్మలపల్లి చందు, కురుమళ్ల రాంబాబు, సిగటాపు నారాయణరావు, ఎంపీటీసీ దూలపల్లి రత్నం, నంద్యాల జాన్, దేశిరెడ్డి సతీష్, దూలపల్లి నాగబాబు, బసవ గోపి, కోటిపల్లి కాశీ విశ్వనాథ్, పెంట వెంకటేష్, తేలు శ్రీనివాస్, గాది వెంకటేష్, నాయుడు మణికంఠ, వెన్న రాంబాబు, పేర్నిడి వెంకట్రావు, కండవల్లి రమణ, కుక్కల బాబు, యాగ సతీష్, ఆకుల దుర్గ, మేడిశెట్టి నాగమణి, నాగిని, అరుణ, అమ్మాజీ, కంద సత్యనారాయణ, కోన లోవరాజు, బసవ నాగలావ బాబు, పిల్లి శ్రీనివాస్, వల్లి దుర్గబాబు తదితర జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment