మార్చి 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను పురస్కరించుకుని బుధవారం మదనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు రామ రామాంజనేయులు ఆధ్వర్యంలో బర్మా వీధి సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభ విజయవంతం కావాలని ప్రార్థించారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మదనపల్లి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సభకు హాజరయ్యే వారికోసం బస్సులు, కార్లు, భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవాళ ప్రచార రథం మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సందర్శిస్తుందని చెప్పారు. ఇది 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన పార్టీ సాధించే ఘన విజయం అవుతుందని, ఈ విజయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమాని అందరూ సంబరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అందించే అమూల్యమైన సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించాలి అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభను విజయవంతం చేయడంలో సహకరించాలని ఆయన కోరారు.
Share this content:
Post Comment