రైల్వే కోడూరులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • రాష్ట్ర సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం అవతరించిన పార్టీ జనసేన.

రైల్వే కోడూరు: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిట్వేలి మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం ప్రజాశ్రేయస్సు ప్రజల పక్షాన బలంగా నిలబడడానికి ఏర్పడిన పార్టీనే జనసేన పార్టీ అని పార్టీ అవిర్భవించి ఒక దశాబ్దం పూర్తి ఔతుందని ఈ 10సంవత్సారాల కాలంలో అనేక ప్రజా పోరాటాలు, సేవా కార్యక్రమాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల మన్నలను పొందుతున్న పార్టీ జనసేన పార్టీ అని శ్రీ పవన్ కళ్యాణ్ ఎటు వంటి తన వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా పార్టీని స్థాపించి తన జీవితాన్నే ప్రజలకు అంకితం చేశారని ఆయన అడుగుజాడలలో నడుస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందని రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీది ప్రధాన మైన భూమిక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనిశెట్టి సుబ్బరాయుడు, మాదినేని నరేష్, మాదాసు శివ, కావేరి అవినాష్, తుపాకుల పెంచలయ్య,షేక్ రియాజ్, ఆనందల తేజ, పెద్ధంగారి సాయి, కొనిశెట్టి చక్రి, కడుమురి సుబ్బు, మా రాజా, పవన్ రాజు, ప్రణీత్ గౌడ్, చింటు, దండు రమేష్ , వెంకటసుబ్బయ్య, ఆనందల లోకేష్, యెద్దల వెంకటాద్రి, నరసింహ పండు, శివ శంకర్, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.