ముట్లూరులో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచేరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జండా దిమ్మె వద్ద జనసేన నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పరిష్కరించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటానికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వట్టిచేరుకూరు మండల ప్రధాన కార్యదర్శి అల్లం రామయ్య, మండల కార్యదర్శి గంగిశెట్టి వెంకట్, మండల సంయుక్త కార్యదర్శులు ప్రవీణ్, సాయి, ముట్లూరు గ్రామ వార్డు మెంబెర్ బీరాల శ్రీనివాసరావు, మాజీ వార్డు సభ్యులు టి. పాపయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు వై. రాంబాబు, జనసేన నాయకులు పి. తంబీ, నాగయ్య, పశ్యావుల సాయి, అల్లం రంగా, మాజీ సొసైటీ అధ్యక్షులు అల్లం చిన్నా, బుర్రి నాగేశ్వరరావు, కిషోర్ రాయల్స్, నరేష్, రాజేష్, రమేష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment