ఒంటిమిట్టలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

*ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నా పయనం జనసేనాని తోనే

*జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

*పండగలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరంలో రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరై ఆ పార్టీ జెండాను ఆవిష్కరించి కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ..ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నేడు పిఠాపురంలోని చిత్రాడలో కనివిని ఎరుగని రీతిలో ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నారన్నారు.జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు,అవరోధాలు దాటి నేడు ఇంత ఘనమైన ఆవిర్భావ సభ పండగను నిర్వహించుకుంటున్నామంటే మనమంతా పార్టీ నాయకుడికి కృతజ్ఞులై ఉండాలన్నారు. ఆయన మనకు సమాజంలో తీసుకొచ్చిన గౌరవం పార్టీ ద్వారా ఆయన ఆశయాలకు తోడు నిలవడం మనకు ఓ మధురానుభూతి దీనికి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలన్నారు.అధికారం లేనప్పుడు ప్రజల కోసం ఎలా పోరాటాలు చేశారో అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం అంతే తపిస్తున్నారన్నారు. తన పరిధిలో ఉన్న శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే పాలన సాగిస్తున్నారన్నారు.ఇప్పటివరకు ఏ పార్టీ నిర్వహించనంతగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోందంటే మనమంతా గర్వించదగ్గ విషయమన్నారు. ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నా పయనం జనసేనాని తోనే నన్నారు. అనంతరం ఇటీవల మాధవరం-1 పంచాయతీలోని వాసవి కాలేజ్ ఎదురుగా యాక్సిడెంట్ రూపంలో చనిపోయిన దత్తాపురం మధు సతీమణి దత్తాపురం దేవికి, రాగూరు శ్రావణి కి రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ ఆర్థిక సాయంతో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని రామయ్య అందించారు అందించారు. పోరాటంగా ప్రారంభమై ప్రజ్వలా ప్రకాశిస్తూ ప్రభంజనంలా పరిభ్రమిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీనేతలకు,జనసేన వీర మహిళలకు,జనసైనికులకు తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దకోట్ల వెంకటసుబ్బయ్య,వెంకీ,జనసేన వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment