గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు, రాచర్ల మండల జనసేన నాయకులు గోపాల్, శంకర్ నాయుడు సహకారంతో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గిద్దలూరులోని మానసిక వికలాంగుల పాఠశాలలో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా జనసేన నాయకులు కేక్ కట్ చేసి, మానసిక వికలాంగుల విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయుడు మాట్లాడుతూ, “జనసేన అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ, తమ సొంత సంపదను ప్రజా సేవ కోసం ఖర్చు చేసే మహనీయుడు” అని ప్రశంసించారు. రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు నాయుడు, పుల్లారావు, రవితేజ, గోపాల్, కోటేశ్వరరావు, విజయ్, తిరుమల శెట్టి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పండుగ రోజున పాఠశాలలో ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి గారు జనసేన నాయకులను అభినందించారు.
Share this content:
Post Comment