రాజంపేట, సిద్దవటం, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టరును ఆదివారం సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లిలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. దేశ, రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎంతో ఆదరణ ఉందని ఆ ఆదరణ అంతా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందన్నారు. ఆ స్థాయిని మనమందరం మరింత పెంచే విధంగా ప్రతి జనసైనికుడు మెలగాలని ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను ప్రశ్నించడం కోసం పార్టీని స్థాపించి నేడు ప్రజల సమస్యల తీర్చే స్థాయికి ఎదిగారన్నారు. మార్చి 14న జరగబోయే12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment