పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధానికి నిరసనగా జనసేన మౌన ప్రదర్శన

  • క్షీర పునీతుడు శ్రీ పవన్ కళ్యాణ్
  • భయం ఎరుగని దీశాలి శ్రీ పవన్ కళ్యాణ్
  • వాలంటీర్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దగ్ధానికి నిరసనగా గాంధీ బొమ్మ వద్ద మౌన ప్రదర్శన
  • నాయకులను, జనసైనికులను మరియు వీరమహిళలను అరెస్టు చేసిన పోలీసులు.. చోటు చేసుకున్న ఉద్రిక్తత
  • ఎట్టికేలకు పవన్ కళ్యాణ్ గారి ముఖచిత్రం కలిగిన జెండాకు పాలాభిషేకం చేసిన జిల్లా కార్యదర్శులు శ్రీమతి జయమ్మ, నగర కార్యదర్శి శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, వీరమహిళలు శ్రీమతి పార్వతి, శ్రీమతి దాసరి సునీత
  • మీడియా వారితో మాట్లాడుతూ తగ్గేదే లేదంటు వైసీపీ పై కౌంటర్ ఎటాక్.. నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

అనంతపురం: అర్బన్ జనసేన ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి సి.వరుణ్ ఆదేశాల మేరకు నగర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ నేతల స్ఫూర్తిని అందిపుచ్చుకొని పోరాట పటిమన ప్రదర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైనికులం మేము. వైసిపి ఉడుత ఊపులకు.. తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదని అనంతపురము నగర, జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు అన్నారు. వాలంటీర్ల వ్యవస్థలో కొందరు చేస్తున్న ఆకృత్యాలు ప్రశ్నించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కోలేక మహిళ వాలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసిపి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలను దగ్ధం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగర కమిటీ ఆధ్వర్యంలో ఇందుకు నిరసనగా గురువారం స్థానిక క్లాక్ టవర్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేపట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి క్షీర పునీతుడు పవన్ కళ్యాణ్ అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు జనసేన నాయకులను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జనసేన నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మౌన ప్రదర్శన చేయడం.. తమ అధ్యక్షుల చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో అనుమతి కావాలా అంటూ ప్రశ్నించారు. పోలీసులు జనసేన నాయకులను, జనసైనికులను మరియు వీరమహిళలను ఈడ్చుకెళ్తు వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి.. పోలీస్ జులుం నశించాలి అంటూ జనసైనికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలన్న సంకల్పం కలిగిన వాలంటీర్ల పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అయితే వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న ఆకృత్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఎండగట్టి తీరుతామన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, కుయుక్తులు చేసినా, మహిళా కమిషన్ను అడ్డుపెట్టుకుని నోటీసులు ఇచ్చినా.. అక్కడున్నది పవన్ కళ్యాణ్ గారు.. భయం అంటే తెలియని దీశాలి అని వైసిపి నాయకులు తెలుసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రగల్బాలు పలికిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 వేల రూపాయల వేతనంతో వాలంటీర్ల ఉద్యోగాలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, జీవన క్రమంలో ఈ వేతనంతో ఒక కుటుంబం సంతోషంగా బ్రతకడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు చిత్తశుద్ధి ఉంటే ఉన్నత చదువులు చదువుకుని అర్హతకు తగ్గ ఉద్యోగం ఇవ్వలేని ఈ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ.. మీ పక్షాన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వైసిపి పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం తూలనాడడం సరికాదన్నారు. వాలంటీర్ల ముసుగులో వైసిపి ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తుంటే చూస్తూ ఊరుకొని ఉండే ప్రసక్తే లేదన్నారు. మీరు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే.. మేము పాలాభిషేకాలు చేసి క్షీర పునీతుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇక మీ అమాయకపు నటనను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు జనసేన రూపంలో గట్టి పోటీ ఎదురు కాబోతోంది. క్షేత్రస్థాయిలో వైసిపి వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ.. అనంతపురం జిల్లాలో వైసిపి ఓటమి లక్ష్యంగా.. జనసేన గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు. పోలీసులు జనసేన నాయకులను అరెస్టు చేసినప్పటికీ.. వీరమహిళలు ఏమాత్రం తడబడకుండా పవన్ కళ్యాణ్ గారి ముఖచిత్రం కలిగిన జెండాకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, శ్రీ అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు సంజీవ రాయుడు, కిరణ్ కుమార్, అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, వెంకటనారాయణ, హుస్సేన్, దరజ్ భాష, నగర కార్యదర్శిలు కుమ్మర మురళి, విశ్వనాథ్, వెంకటరమణ, నెట్టిగంటి హరీష్, ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ మరియు నాయకులు గల్లా హర్ష, చిరు, చరణ్, కాకర్ల శీన, హిద్ధూ, నజీమ్, ప్రవీణ్ కుమార్, బాబ్జాన్, పెండ్లిమర్రి శీన, నవీన్, అశోక్, సల్మాన్, నౌషాద్, విశ్వనాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.