కుందనపల్లి గ్రామంలో జనంలోకి జనసేన

తెలంగాణ, రామగుండం నియోజకవర్గం, అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో ఆదివారం రామగుండం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగింది. కుందనపల్లి గ్రామానికి సంబంధించిన 50 మంది యువకులు రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల అధ్యక్షుడు గోపికృష్ణ మరియు మండల ఉపాధ్యక్షులు మేకల సంతోష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు గొట్టే మధుకర్, లింగం బాలరాజు, శెట్టి రాజశేఖర్ ఆశ్రిత్ జగదీష్, పవన్, శివ, పృథ్వి రాజ్, పవన్, పవన్ సింగ్, రఘు, కార్తిక్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.