జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా జనసేన

భైంసా, జూనియర్‌, ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌చేసే జీవోను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రకమిటీ పిలుపుమేరకు శనివారం రెండవ రోజు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట డివిజన్ పరిధిలోని జూనియర్‌ పంచా యతీ కార్యదర్శులు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ సమయం పూర్తైనా ప్రభుత్వం రెగ్యులర్‌ చేయడంలో కాలయాపన చేస్తోందన్నారు. వెంటనే రెగ్యులర్‌ చేస్తూ జీవోను విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఈ సమ్మెలో ఔట్‌సోర్సింగ్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.