తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధం

తెలంగాణ, హుజూర్నగర్ నియోజకవర్గం: హుజూర్నగర్ లో ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ 32 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమైందని రాష్ట్ర నాయకత్వం తెలియజేయడం జరిగింది అని తెలియపరిచారు, 32 నియోజకవర్గాల్లో హుజూర్నగర్ కూడా బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండటం వల్ల హుజూర్నగర్ కూడా పోటీలో ఉంటుందని.. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నకిరేకల్ కోదాడ హుజూర్నగర్ నియోజవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలపడం జరిగింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాల నచ్చి ఎంతోమంది యువత పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.