మత్స్యకారుల మహా పోరాటానికి పునాది జనసేన: శివదత్ బోడపాటి

పాయకరావుపేట: రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ పోరాటంగా నిలిచిన నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారుల మహా శాంతియుత ధర్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరువాత ఇదే అతి పెద్ద పోరాటం, ఈ పోరాటానికి పునాది వేసింది జనసేన పార్టీ అలాగే మొదటి రోజు నుండి నేటి వరకూ మత్స్యకారులు హీటిరో కంపెనీపై చేస్తున్న పోరాటానికి అండగా నిలబడింది జనసేన పార్టీ స్థానిక, రాష్ట్ర మరియు ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వం అని గర్వంగా చెపుతున్నానని మహా శాంతియుత ధర్నాలో పాల్గొన్న పాయకరావుపేట జనసేన స్టేట్ సెక్రటరీ శివదత్ బోడపాటి తెలియజేసారు.