జనసేనాని సేవా స్పూర్తిని ముందుకు తీసుకువెళ్తున్న యువత

పాలకొండ నియోజకవర్గం: పాత పాలవంచలోని యువకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో, ఆయన పుట్టినరోజున సేవా కార్యక్రమం చెయ్యాలనే మంచి ఉద్దేశ్యంతో డబ్బులు దాచుకొని సుమారు 50 మంది యాచకులకు వాటర్ బాటిల్ తో సహా అన్నదాన సేవా కార్యక్రమం చేశారు. సుమారు 18 సంవత్సరాల వయసు గల యువకులు వంశీ, సురేంద్ర, చందు, మని, వినయ్, దినేష్, వంశీ కెల్లా, భావం, రామ్ చరణ్, ప్రమోద్, నాగ అభిషేక్, ఏకేశ్వర్, సంతోష్, హర్షిత్, నిహాల్, సూర్య వెంకట్ వీరంతా జనసేన పార్టీ కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తున్నారని భాష, ఖాసిం పేర్కొన్నారు.