నెల్లూరు గోమతి నగర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు, కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డి.ఈ.ఈ వెంకటేశ్వర్లు, సుధామాధవ్, వెంకట్ తాల్లూరి, ఆఫీస్ ఇంచార్జి జమీర్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment