మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనసేన నాయకుడు ప్రేమ కుమార్

హైదరాబాద్: కెపిహెచ్బి కాలనీ 3వ ఫేజ్‌లో (మంజీరా లులూ మాల్ ప్రక్కన) గల శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అఖిల భారత రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత నాయకులు సందీప్ ధనపాల్, అరవింద్ చెర్రీ ఆహ్వానంపై, ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అతిథిగా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు & చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ రవణం స్వామి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ, “మెగాస్టార్ చిరంజీవి గారు సేవా దృక్పథంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి రక్తదానం, నేత్రదానం ద్వారా ప్రాణదాతలుగా నిలవాలని ప్రేరేపించారు. ప్రపంచంలో తయారు చేయలేని ఒక్క వస్తువు రక్తమే. రక్తదానం ద్వారా ప్రాణాన్ని అందించొచ్చు”, అని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి 40వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి స్ఫూర్తితో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన యువతను అభినందించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, కలిగినిడి ప్రసాద్, పులగం సుబ్బు, యాళ్ళ శిరీష మరియు మెగా అభిమానులు ఊచా రాంబాబు (భుట్టో), నూతి రాంబాబు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment