జనసేన నేతకు దళిత రత్న పురస్కారం

*సంతోషం వ్యక్తం చేసిన బైరపోగు సాంబశివుడు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని, తెలంగాణ అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ “దళిత రత్న అవార్డు”కు జనసేన నాయకుడు బైరపోగు సాంబశివుడు ఎంపికయ్యారని ప్రకటించారు. జూన్ 27 శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వజన కళామండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, బైరపోగు సాంబశివుడుకి అవార్డు అందజేశారు. ముఖ్య అతిథులుగా ఇటుక రాజు మాదిగ, టి.వై.ఆర్ ఫౌండేషన్ అడ్వకేట్ తలకొక్కుల రాజు, అంబేద్కర్ సాహితీ పీఠం కార్యదర్శి బోద్దాన అప్పారావు, ఎం. అనంతయ్యలు హాజరై పురస్కారం అందించారు. ఈ సందర్భంగా సాంబశివుడు మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అంబేద్కర్ ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా చైర్మన్ ఇటుక రాజు మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిక్కపల్లి వెంకటేష్, నరసింహారాజ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-06-28-at-11.18.11-AM-1-1024x685 జనసేన నేతకు దళిత రత్న పురస్కారం

Share this content:

Post Comment