దాడి అనిల్ కుమార్ కు బీమా చెక్కును అందజేసిన జనసేన నాయకులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు దాడి అనిల్ కుమార్ ప్రమాదంలో గాయపడగా ఆయన కుటుంబానికి 42000 రూపాయల బీమా చెక్కును జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదల నాగేంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరీ శంకర్ గౌడ్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర నాయకులు (రామగుండం నియోజకవర్గం కో ఆర్డినేటర్ ) మూల హరీష్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు, రసూరి హరి కృష్ణ, జెట్టి సాగర్, బొంగని అంజి తదితరులు పాల్గొన్నారు.