జానకి రాఘవకు ఘనంగా సన్మానంచేసి, శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేతలు

ఆలమూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి, డిప్యూటీ తాసిల్దార్ గా ప్రమోషన్ పొందిన జానకి రాఘవ కు శుభాకాంక్షలు తెలిపి ప్రజలకు మంచి చేసే అధికారులకు ఎప్పుడూ అండగా ఉంటాం అని ఆలమూరు మండల జనసేన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలం రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ లో గత కొద్దిరోజుల క్రిందట వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తూ, ఆలమూరు మండల ప్రజలకు అందరికీ సేవలు అందించిన జానకి రాఘవకు డిప్యూటీ తాసిల్దారుగా ప్రమోషన్ రావడం, మరల ఆలమూరు మండలంలో రెవెన్యూ అధికారిగా సేవలందించుచున్నఒదులకు, జనసేన పార్టీ తరపున ఆలమూరు మండలంలోని పలువురు ప్రముఖ సీనియర్ జనసైనికులు, కార్యకర్తలు డిప్యూటీ తాసిల్దారు జానకిరాఘవ కు అభినందనలు తెలియజేసి ఘనంగా దుస్సాలువ తో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల జనసేన పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ సన్మానమునకు విచ్చేసిన జనసేన ఆలమూరు మండల ప్రతినిధులు తాళ్ల డేవిడ్ రాజ్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ యువ నాయకులు సంగీత, సుభాష్ పినపల్ల, గ్రామ సర్పంచ్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, సందిపూడి గ్రామ సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు, మూలస్థానం గ్రామ సర్పంచ్ లంకే వరప్రసాద్, పినపల్ల గ్రామ ఎంపీటీసీ సభ్యులు పెద్దిరెడ్డి, పట్టాభి పినపల్ల, చొప్పెల్ల గ్రామ ఎంపిటిసి సభ్యులు జాంపోలు నాగేశ్వరరావు, బడుగువానిలంక గ్రామ ఎంపీటీసీ సభ్యులు పడాల అమ్మిరాజు దంపతులు, చెముడు లంక గ్రామ ఎంపీటీసీ సభ్యులు తమ్మన భాస్కరరావు, సీనియర్ జనసేన నాయకులు గారపాటి త్రిమూర్తులు, సందిపూడి గ్రామ ఎంపీటీసీ సభ్యులు తోలేటి సంతోషి, బావిశెట్టి తాతాజీ, యర్రం శెట్టి మంగాయమ్మ, పలువురు జనసైనికులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు.