జిల్లా ఎస్పీ సుసారపు శ్రీధర్ ని కలిసిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీ సుసారపు శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు కలిసారు. వారి వెంట రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహదశ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సీనియర్ నాయకులు సుధా చిన్న, కుంపట్ల వెంకట రమేష్, చిక్కం సూర్యమోహన్, మోకా బాలయోగి, మామిళ్లపల్లి దొరబాబు, పొణకల ప్రకాష్, ముత్తాబత్తుల శ్రీను, గోర్తి పవన్ తదితరులువున్నారు.